అన్నారుగూడెంలో నేడు ఏ ఎల్ ఎం ఎస్ ఈ సమావేశం

★ హాజరైన తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ★ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గొడ్ల ప్రభాకర్,ఉప సర్పంచ్ కె.వి.

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 13, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో అంగన్వాడి ఏఎల్ఎంఎస్ఈ సమావేశం అన్నారుగూడెం 8 వ అంగన్వాడి కేంద్రం నందు సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, అన్నారుగూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు సూపర్వైజర్ సత్యవతి, అంగన్వాడి టీచర్ల సమక్షంలో జరిపించారు, అనంతరం చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ద్వారా జరిపించారు. అనంతరం కార్యక్రమాలను ఉద్దేశించి మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలు యోగక్షేమలతో ఉన్నారు అంటే కేవలం అంగన్వాడి కేంద్రాల పనితీరేనని, వారు నిరంతరం మాతా శిశు సంరక్షణలో ప్రత్యేక పర్యవేక్షణలలో ఉంటూ వారిని కంటికి పాపల చూసుకుంటున్నారని ఆయన అన్నారు. ఏదేమైనా మీ అంగన్వాడి కేంద్రాల పనితీరు చాలా సంతృప్తినిస్తోందని ఇదే పనితీరు భవిష్యత్తులో కూడా పోషిస్తారని, రానున్న రోజుల్లో పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో కృత నిశ్చయంతో పనిచేసి గ్రామాన్ని సంపూర్ణ ఆరోగ్య గ్రామంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నూతనంగా సర్పంచ్ ఉప సర్పంచ్ గా ఎన్నికై మొదటిసారి అంగనవాడి కేంద్రానికి విచ్చేసిన సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు లను వారు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్నారుగూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు, ఏ ఎస్ డిపిఓ నవ్య, సూపర్వైజర్ సత్యవతి, పల్లె దవాఖాన వైద్యులు గోపి, స్థానిక అంగన్వాడి సెంటర్ టీచర్ నాగమల్లేశ్వరి, క్లస్టర్ పరిధిలో ఉన్న అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం లు, పంచాయతీ సిబ్బంది, మల్టీపర్పస్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.