ఆటోలో మరిచిపోయిన 4 తులాల బంగారం.

★ డ్రైవర్ నిజాయితీ, పోలీసుల చొరవతో బాధితురాలికి క్షేమంగా!

పయనించే సూర్యుడు జనవరి 13 ఆదోని నియోజకవర్గ క్రైమ్ రిపోర్టర్ కృష్ణ అనంతపురం నుంచి ఆదోని వచ్చిన విజయలక్ష్మి అనే మహిళ, ఆటోలో ప్రయాణిస్తూ పొరపాటున 4 తులాల బంగారు నగలు, మొబైల్ ఉన్న పర్సును సీటుపైనే వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే అలర్ట్ అయిన ఆదోని వన్ టౌన్ పోలీసులు, మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఆటోను ట్రేస్ చేశారు. రాయనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ విద్యాసాగర్ తన ఆటోలో ఉన్న పర్సును పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఆ పర్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా, వన్ టౌన్ సీఐ చేతుల మీదుగా నగలను బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా ఆశకు పోకుండా నగలు తిరిగిచ్చిన డ్రైవర్ విద్యాసాగర్‌ను సీఐ శాలువాతో సన్మానించి అభినందించారు. పోగొట్టుకున్న నగలు తిరిగి దొరకడంతో బాధితురాలు కళ్ళలో నీళ్లతో పోలీసులకు, ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.