ఆరు విపిఆర్‌ అమృతధార మినరల్‌ వాటర్‌ప్లాంట్లు, సిమెంటురోడ్లకు ప్రారంభోత్సవాలు

పయనించే సూర్యుడు జనవరి 13 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల్లూరు, జనవరి 12 సోమవారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం నియోజకవర్గంలోని అనంతసాగరం, మర్రిపాడు, ఏఏస్‌పేట, సంగం, చేజర్ల మండలాల్లో అభివృద్ధి పనులకు మంత్రి, ఎంపీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలోని విపిఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఏర్పాటుచేసిన 6 అమృతధార వాటర్‌ప్లాంట్లను, 69లక్షల ఉపాధిహామీ నిధులతో నిర్మించిన సిమెంటురోడ్ల ప్రారంభోత్సవం, ఏఏస్‌ పేట మండలం మదరాబాదులో 22.80లక్షలతో జల్‌జీవన్‌ మిషన్‌ రక్షిత మంచినీటి పథకం ప్రారంభోత్సవాల్లో మంత్రి, ఎంపీ పాల్గొంటారు. అనంతసాగరం మండలం ఎగువపల్లి, మర్రిపాడు మండలం రాజుపాలెం, ఏఏస్‌పేట మండలం మదరాబాదు, కావలియడవల్లి, సంగం మండల కేంద్రంలో, చేజర్ల మండలం ఎన్‌వి కండ్రిగలో విపిఆర్‌ అమృతధార వాటర్‌ప్లాంట్లు, సిమెంటురోడ్లను మంత్రి, ఎంపీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు