ఆవుల రాంబాబు పదవి విరమణ

★ కార్యక్రమాలకు హాజరైన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 13 పెనుగంచిప్రోలు ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నందిగామ పట్టణానికి చెందిన ఆవుల రాంబాబు పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, గత 27 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించి ఈరోజు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పదవీ విరమణ సన్మాన సభ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముఖ్య అతిథిగా పాల్గొని, ఆవుల రాంబాబు ని శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన షేక్ నాగుల్ (వెల్డింగ్) కుమార్తె ఓణీలు వేడుక మహోత్సవంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని చిన్నారికి అక్షింతలు వేసి దీవించారు.