ఉజ్వల యోజనతో మహిళలకు నిజమైన వెలుగు,

* బీజేపీ టౌన్ అధ్యక్షులు తోవి నాగార్జున

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి) భారతీయ జనతా పార్టీ ఆదోని టౌన్ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున ఆధ్వర్యంలో, కార్వాన్ పేట, రాయనగర్, కౌడల్ పేట ప్రాంతాలకు చెందిన 50 మంది అర్హులైన నిరుపేద మహిళలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక ఉజ్వల యోజన పథకం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద మహిళలు పొయ్యి పొగతో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన పథకం ఉజ్వల యోజన అని మహిళల ఆరోగ్యం భద్రత గౌరవాన్ని కాపాడడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల ఇంటి గడప వరకు చేరాలన్నదే మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, బీజేపీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహిళా మోర్చా ఇన్‌చార్జీ వినితా గుప్తా, ఆదోని టౌన్ సెంట్రల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఆదోని టౌన్ సెంట్రల్ కార్యదర్శులు ప్రశాంత్, లక్ష్మీనారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల సంక్షేమమే దేశ అభివృద్ధి బీజేపీ మాట కాదు, చేతలలో చూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *