పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయం మహా శివరాత్రి ఉత్సవ జాతర సందర్భంగా పలు రకాల ఆలయ అలంకార పనుల ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేసినట్లు దేవదాయ శాఖ ఇన్స్ పెక్టర్ కమల తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యాలయంలో సోమవారం రోజున సీల్డ్ కొటేషన్ తెరిచి విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణ ఆలయ రంగులు, లైటింగ్ సౌండ్ సిస్టమ్, టెంట్స్, 2,70,116 రూ,విలువగల టెండర్లు ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ జిల్లా ఇన్స్ పెక్టర్ కమల ,ఆలయ ఏవో రాములు ఆలయ ప్రధాన పూజారి గణేష్ మహారాజ్, కొటేషన్ దారులు తదితరులు పాల్గొన్నారు.