పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 13 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ. షకీల్) స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో ప్రభుత్వ హాస్పిటల్ లో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమానికి సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఏబీవీపీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు స్వామి వివేకానంద జయంతి 163 బ్లడ్ క్యాంప్ చాలా సంతోషకరం ఇలాగే భారతదేశంలో ఉన్న యువత అందరూ కూడా స్వామి వివేకానంద బాటలో నడవాలని అనేక కార్యక్రమాలు వివేకనంద యూత్ ఆదర్శంగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బ్లడ్ డొనేషన్ 25 వరకు చేశారు. స్టేట్ హాస్టల్ స్కోప్ కన్వీనర్ భామండ్ల నందు, జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రావు టౌన్ సెక్రెటరీ రుద్రవేణి ధనుష్, వైస్ ప్రెసిడెంట్ శివకుమార్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ ,శ్రీకాంత్,గిరిధర్ శ్రావణ్, మందిర్, ఉమేష్, నితిన్, ప్రవీణ్ ,సాయి, భూమేష్ తదిపరులు పాల్గొన్నారు