పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 13 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో సంక్రాంతి శుభ సందర్భంగా సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేశారు. మొత్తం 50 మంది మహిళలు పోటీల్లో పాల్గొనగా, మొదటి బహుమతిని సల్లూరి కవిత దక్కించుకోగా, రెండవ బహుమతిని ఇట్నేని భాగ్యలక్ష్మి విజేతగా సాధించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహకంగా సీరియల్స్‌ను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయికల్ ఎంపీవో సుమ పాల్గొని మాట్లాడుతూ, గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిలుపుకోవడం ఆనందకరమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి, ఉపసర్పంచ్ కుర్ర గణేష్,కార్యదర్శి రాజశ్రీతో పాటు వార్డు సభ్యులు రంజిత్ రాజు, పద్మ, గౌతమి, విక్నేని లక్ష్మి, రాజులు,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంప్రదాయ ముగ్గులతో గ్రామ పంచాయతీ ఆవరణ కళకళలాడగా, సంక్రాంతి పండుగ వాతావరణం కట్కాపూర్ గ్రామంలో ఉట్టిపడింది.