కుషాయిగూడలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి..

పయనించే సూర్యడు / జనవరి 13/కాప్రా ప్రతినిధి సింగం రాజు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని, భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు శ్రీ స్వామి వివేకానంద జయంతిని కుషాయిగూడ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. కుషాయిగూడ డివిజన్ బిజెపి అధ్యక్షులు చల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామీజీ చూపిన మార్గంలో యువత నడవాలని, బలమే జీవనం, బలహీనతే మరణం అనే ఆయన సందేశాన్ని ప్రతి ఒక్కరు జీవితంలో అమలు చేయాలని ఆకాంక్షించారు. అలాగే హిందువునని గర్వించు - హిందువుగా జీవించు అనే స్వామీజీ నినాదాలను స్మరించుకుంటూ భావితరానికి ఆయన ఆలోచనలు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ గౌడ్, డి నాదం, ఉప్పల్ అసెంబ్లీ మీడియా కన్వీనర్ తాళ్ల ఆనంద్ గౌడ్, ఆర్ వెంకటేశ్వర్లు, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, లక్ష్మి నారాయణ, అశోక్, గణేష్ గౌడ్, బ్రాహ్మచారి, దయానంద్, బోల శ్రీనివాస్, అశోక్, వెంకటేష్ యాదవ్, హరినాయక్ సహదేవ్ గౌడ్, శ్రీకాంత్, భరత్, శ్రీశైలం, విద్యాసాగర్, రత్నపురం వెంకటేష్, వి.రాంబాబు, బండారి అనిల్, కిరణ్ మహిళా నాయకురాలు చంద్రకళ, కళావతి, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొని స్వామీజీ బోధనలను స్మరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.