కేశవపట్నంలో సమ్మక్క జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్

పయనించే సూర్యుడు జనవరి 13 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్దిగట్టయ్య :కేశవపట్నం గ్రామంలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరను భక్తులు సౌకర్యవంతంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ అధికారులకు సూచించారు. సోమవారం రోజున ఆయన గ్రామ పాలకవర్గ సభ్యులతో కలిసి సమ్మక్క గద్దెలు పరిసర ప్రాంతాలను సందర్శించి జాతర ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించారు ఈ సందర్భంగా భక్తులకు అవసరమైన స్నాన ఘట్టాలు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, శుద్ధమైన తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సదుపాయాలు, పారిశుద్ధ్య చర్యలు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుతూ జాతర ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రత్యేకంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విలాస్ తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామ కార్యదర్శి దురిశెట్టి నర్సయ్య పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారుఈ పర్యవేక్షణ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొని జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తమ సహకారం అందించారు