కొనసాగిన పునీత జోజప్ప ఆలయ రజిత జూబ్లీ వేడుకలు

★ ప్రార్థనలు చేస్తున్న పాస్టర్లు.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 బోధన్: సాలూర మండలం జాడి జమాల్ పూర్ గ్రామంలో పునీత జోజప్ప ఆలయ రజిత జూబ్లీ వేడుకలు సోమవారం కొనసాగాయి.రజిత జూబ్లీ వేడుకల సందర్భంగా చర్చి వద్దకు గ్రామస్తులు, భక్తులు, పాస్టర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు,భక్తులు చర్చి వద్దకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. చర్చ్ నిర్వాహకులు వచ్చినటువంటి గ్రామస్తులు, భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. ఏసుప్రభు ఆశీస్సులు పొందారు. రజిత జూబ్లీ వేడుకలు శోభాయమానంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు కోలాటాలు చేస్తూ పలు సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు. గ్రామంలో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏసుప్రభువు కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.