కొబ్బరి సాగు లోనూ యాంత్రీకరణ సద్వినియోగం చేసుకోండి

★ ఆత్మ(బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు ★ కొబ్బరి సాగు లోనూ పలు ప్రయోజనాలు ★ పామాయిల్ ధీటుగా ఆదాయం. ★ సీడీ బీ డీడీ మంజునాథ్ రెడ్డి ★ రాయితీలు పొంది కొబ్బరి సాగు విస్తరించండి ★ కొబ్బరి రైతు సంఘం నేత పుల్లయ్య

పయనంచే సూర్యుడు జనవరి 13 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొబ్బరి సాగు లోనూ ప్రభుత్వ పథకాలతో వచ్చే రాయితీలతో యాంత్రీకరణ పెంపొందించుకోవాలని ఆత్మ (బీఎఫ్ఏసీ ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు రైతులకు సూచించారు. స్థానిక రైతు వేదిక లో సోమవారం 46 వ కొబ్బరి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను కొబ్బరి అభివృద్ధి మండలి ఆద్వర్యంలో తెలంగాణ కొబ్బరి సాగు దారుల సంఘం పర్యవేక్షణలో, ఈ సంఘం బాధ్యులు కొక్కెరపాటి పుల్లయ్య నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సుంకవల్లి వీరభద్రరావు మాట్లాడు తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పధకాలను అమలు చేస్తుంది అని అన్నారు. ఉద్యాన పంటల్లో పామాయిల్ కు ధీటుగా దీర్ఘకాలం ఆదాయం వచ్చేది కొబ్బరి సాగుతో నేనని కొబ్బరి అభివృద్ధి మండలి డిప్యూటీ డైరెక్టర్ జీవీ మంజునాథ్ రెడ్డి అన్నారు. కొబ్బరి అభివృద్ధి మండలి చే అమలు చేసే పధకాలను ఆయన వివరించారు. బోర్డ్ అందించే రాయితీలతో కొబ్బరి సాగు విస్తీర్ణం పెంచాలని పుల్లయ్య రైతులకు విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో ఏడీ రఘుతన్, ఏడీఏ పెంటేల రవికుమార్, వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నీలిమ, హెచ్ఈఓ ఈశ్వర్ లు అశ్వారావుపేట పాక్స్ మాజీ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,తలశిల ప్రసాద్, తుమ్మ రాంబాబు,కాసాని పద్మ శేఖర్, ఆళ్ళ నాగేశ్వరరావు, సీమకుర్తి వెంకటేశ్వరరావు, పసుపులేటి ఆదినారాయణ పాల్గొన్నారు.