పయనించే సూర్యుడు. న్యూస్. జనవరి 13 ఆదోని. డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి). పల్లె ప్రజానీకానికి, మరియు,గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే వైద్య సేవలు అందించాలని అందరికీ అందుబాటులో ఉండేందుకు కోసిగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద 50 లక్షలు నిధులు కేటాయిస్తే ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి పరచకుండా స్థానికంగా విధులు నిర్వహిస్తున్న మనోజ్ కుమార్, రంజిత్, నజీర్ స్థానంలో వచ్చిన డాక్టర్ రాజ కిరిటి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను గుట్టు చప్పుడు కాకుండా స్వాహా చేశారని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి నుంచి నిధులు రికవరీ చేయాలని ,వీధుల నుంచి తొలగించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుదర్శన్ , కోసిగి మండల కార్యదర్శి గోపాలు, ఆదోని మండల కార్యదర్శి కల్లుబావి రాజు ఏపీ రైతు సంఘం నాయకులు తాయన్న తదితరులు సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కోసిగి మండలంలో దాదాపు 30 గ్రామాల ప్రజలకు ఇటువంటి చిన్నచిన్నఅనారోగ్య సమస్యలు ఎదురైతే దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రధమ చికిత్సచేయించు కుంటున్నారు. ఎక్కువ సంఖ్యలో గర్భిణీ స్త్రీలు కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ప్రసవాలు జరుగుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో కేంద్రాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచకుండా తల్లి బిడ్డలను సురక్షితమైన ప్రాంతంలో ఉంచకుండా శిధిల వ్యవస్థకు చేరుకున్నటువంటి రూములలో ఉంచుతున్నారని గదులకు వెంటిలేటర్స్ లేకపోవడంతో విపరీతమైనటువంటి దోమలు చలిగాలులు ఇతర జంతువులు ప్రవేశించి తల్లి బిడ్డలపై దాడులు చేస్తున్నప్పటికీ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో కోసిగి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని మరమ్మతులు చేసి మెరుగైన వైద్యులు సేవలు అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోసిగి మండల సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని అధికారులకు హెచ్చరించారు.