గడ్డం వారి పల్లి లో ఘనంగా గంగ జాతర

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 13.01.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మండలంలోని పంచాయితీ కేంద్రం గడ్డం వారి పల్లిలో ఆదివారం గంగజాతరను ఘనంగా నిర్వహించారు గ్రామంలో మండలం రోజుల క్రితం బోయకొండ గంగమ్మకు ఆలయాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గంగ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు అమ్మవారికి గిరిగలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు గ్రామ దేవతకు మహిళల ఆధ్వర్యంలో పిండి దీపారాధన వంటి కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో బోయకొండ గంగమ్మ ఆలయ నిర్మాణ కర్త గిరిబాబు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు