పయనించే సూర్యుడు జనవరి 13, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల హామీల్లో భాగంగా ఈ రోజు రాయపల్లి గ్రామంలో కరెంట్ లైన్ ఇన్స్పెక్టర్ ఉసేన్ ‘గృహ జ్యోతి’ పథకం విజయవంతంగా కొనసాగుతుందని ,హర్హులైన ప్రతి ఇంటికి జీరో బిల్లులు పొందే కుటుంబాలకు గృహ జ్యోతి కార్డులను అందజేశారు . ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయని, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు లబ్ధిదారుల పక్షాన ప్రభుత్వం సుమారు రూ. 3,593 కోట్లను నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు.విద్యుత్ బిల్లుల కోసం గతంలో ఖర్చు చేసిన డబ్బును ఇప్పుడు మీ పిల్లల చదువులకు, ఆరోగ్యానికి ఇతర కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజా సంక్షేమ పాలనకు ఈ పథకం ఒక నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులకు నూతన సంవత్సర ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ ఉసేన్ , జూనియర్ లైన్ మెన్ మహేందర్, దూళ్ల సాయి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు