పయనించే సూర్యుడు జనవరి 13 దండేపల్లి దండేపల్లి మండలం గూడెం గ్రామం లోని స్తానిక ఒడ్డెర కాలనిలో స్వాతంత్ర్య సమరయోధుడు ఒడ్డెర జాతి ఆణిముత్యం ఓబన్న జయంతి వేడుకలు గూడెం గ్రామ ఒడ్డెర సంగం అద్యక్షకుడు ముద్దంగుల. కొమురయ్య, స్తానిక తాజా మాజి ఎం,పీ,టీ,సీ తోట. మోహన్ ఆధ్వర్యం లో కాలని వాసుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భబంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఓబెన్న స్పూర్తిగా తీసుకోని భవిష్యత్తు తరాల వారు స్ఫూర్తి పొందేలా “ఒబెన్నా విగ్రహ ఏర్పాటును పెద్దలు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల. ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకు వెళ్లి, విగ్రహ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి తాజా మాజీ .ఎం.పీ.టీ.సీ ముత్యాల శ్రీనివాస్, పెద్దపేట .ఎంపీటీసీ, బొడ్డు. కమలాకర్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వనపర్తి. రవి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది. సతీష్ కుమార్ లు మరియు ఒడ్డెర సంగం నాయకులు పల్లపు. లక్ష్మీ రాజం, కొమిరె. రాయమల్లు, పల్లపు. గంగరాజు, దారంగుల. రాజేష్ తధితరులు పాలగొన్నారు.