
పయనించే సూర్యుడు, జనవరి 13, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, అంజనాపురం గ్రామంలో సోమవారం స్వామి వివేకానంద జయంతిని ఏకల్ అభియాన్ సంస్థ మరియు బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకల అభియాన్ సంస్థ వారు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని అతి చిన్న వయసులోనే భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. యువత దేశానికి వెన్నుముకని యువత ఎక్కడైతే కట్టిష్టంగా ఉంటారో బలంగా ఉంటారో ఆ దేశం బలంగా ఉంటుందని అన్నారు, ప్రస్తుత సమాజంలో యువత చెడు మార్గం వైపు ఆకర్షితులు అవుతున్నారని చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని బంగారు భవిష్యత్తును యువత నిర్మించుకోవాలని గంజాయి, సిగిరెట్, మత్తు పానీయాలు లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అంజనాపురం సర్పంచ్ బి నరసింహ, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు భూక్య సీతారాముల నాయక్, తేజావత్ జానకిరామ్ నాయక్ ఎన్ఆర్ఐ, మోరంపల్లి బంజర గ్రామ ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి, గ్రామ పెద్ద భానోత్ లింగ, బానోత్ రవినాథ్, వార్డు సభ్యులు బి సోను, బన్సీలాల్, ప్రవీణ్, ఏకల్ అభియాన్ గ్రామ మాతాజీ బి హుస్సేని, దేవ్ సింగ్, పుణ్య నాయక్, గంగా బాయ్, ఓరుగంటి సురేష్ కుమార్, సురేష్ , సతీష్ ఖండల్వాల్, సాగర్, ఆచార్య మాతాజీలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బిజెపి కార్యకర్తలు, ఏకల్ అభియాన్ సంచ్ ప్రముఖులు యువకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు