చేగుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద స్వామి వివేకానంద జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ 13 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంటలో మా నాన్నగారి జ్ఞాపకార్థం కోసం స్వామి వివేకానంద విగ్రహం చేగుంటలో పెడతా, చేగుంట మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మహమ్మద్ రఫీ అన్నారు చేగుంట మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు స్థానిక గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సండ్రుగు సతీష్ ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీ, విశ్రాంత ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పెన్నులు కంపెనీ చేశారు. వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద జనవరి 12 1963న కోల్ కత్త లో నరేంద్ర నాథ్ దత్తగా జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువు సంగీతం వ్యాయామాలలో రాణించారు. ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ మా నాన్న జ్ఞాపకార్థం వచ్చే సంవత్సరం స్వామి వివేకానంద జయంతి లోపు విగ్రహం చేగుంటలో పెడతానని, స్వామి వివేకానంద మనకు స్వాతంత్రం రాకముందు చిన్న వయసులో 1000 సంవత్సరాల చరిత్ర సృష్టించారు. యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద మనకు స్వాతంత్రం రాకముందు కాలినడక ప్రతి గ్రామానికి తిరిగి మనo స్వాతంత్రం సంపాదించుకోవాలని అవగాహన కల్పించిన వ్యక్తి స్వామి వివేకానంద, ప్రతి ఒక్క యువకుడు ఉక్కు కండలు కలిగి ఉండాలి మత్తు బానిస కాకూడదు అని చెడు అలవాట్లకు పోకూడదని ఆయన బోధించినాడు. ఆయన స్ఫూర్తి తెలుసుకుని యువకులు మంచి దారిలో నడవాలని మన భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి మన భారతదేశ ఔన్నత్యాన్ని ముక్కు మీద వేలు వేసుకునేలా ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సండ్రు గు సతీష్, ఉప సర్పంచ్ మహ్మద్ రఫీ, వార్డు సభ్యులు సాయిబాబా, రవి, వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది