చేజర్లలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వు కార్యక్రమం బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు జనవరి 13 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల బస్టాండ్ ఆవరణంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వు కార్యక్రమాన్ని చేజర్ల గ్రామంలో నీ శివాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య చేజర్ల మండల అధ్యక్షులు గుండాల విజయభాస్కర రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. నాయకులు మాట్లాడుతూ 1026 సంవత్సరం జనవరి నెల 8,9,10 తేదీలలో గజ్జన్ని మహమ్మద్ ద్వారా ద్వారా సోమనాథ్ ఆలయం విధ్వంసం చేయబడింది. ఆ తర్వాత 1951 లో అప్పటి కేంద్ర హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఆలయ పునరుద్ధరణ జరిగినది అని వివరించారు. ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పాటు సోమనాథ్ స్వాభిమాన్ పర్వు గా నిర్వహించాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అందుకని ఈ కార్యక్రమం జరపడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఈఎంసి జగ్గారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి ఆముదం యానాద్ రెడ్డి అచ్చాల మస్తాన్ రెడ్డి , ఓర్సు పెంచలయ్య , కొండ కోటేశ్వర్ రెడ్డి . దాసరి హజరత్తయ్య తదితరులు పాల్గొనడం జరిగినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *