జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 బోధన్ : బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద మరియు లోకమాత జీజిబాయ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ యువతకు మహా ప్రేరణ, యువత శక్తిని నమ్మిన గొప్ప నాయకుడు నేటి యువతరానికి ఆదర్శమూర్తి, భారత దేశ పేరు ప్రతిష్టలు ప్రపంచ నలుమూలల విస్తరింపజేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ జ్యోతి, పంచాయతీ సెక్రెటరీ సునీత, విడిసి చైర్మన్ గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ న్యాలం శ్రీనివాస్, వార్డు సభ్యులు రామ్, మహేష్, అశోక్, చంద్రకాంత్, మోహన్, రమేష్, షేక్ హబీబ్, గ్రామ పెద్దలు బాబు, గౌర్ఢోండ, మొగులయ్య, శంకర్ రెడ్డి, జననీ యూత్ ప్రతినిధులు బాలు, మహేష్, శివ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.