
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 13, తల్లాడ రిపోర్టర్: మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో జిల్లా పశు గుణభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశువైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కోడూరు వీర కృష్ణ ఉమాదేవి, ఉప సర్పంచ్ కృష్ణా నాగలక్ష్మి రుబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పశువులలో వస్తున్న వివిధ రకాల వ్యాధులు ప్రభలం కాకుండా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామంలో గేదలున్న వారందరూ కూడా వినియోగించు కోవలసిందిగా తెలియజేశారు, అదేవిధంగా పోషక లోపు ఉన్న గేదెలకు వివిధ రకాల మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ అనాస్ మందాని, జే ఓ నాగరాజు, సిహెచ్ఓ చుక్కారావు, సూపర్వైజర్ శివకృష్ణ, గోపాల్ మిత్ర సత్యనారాయణ, రమేష్, వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబరు దుర్గారావు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇసనపెల్లి వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
