పయనించే సూర్యుడు 13-1-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో 1 వార్డు లో గత రెండు సంవత్సరాల క్రితం నుండి బోర్ ( బోరింగ్)పనిచేయకపోవడంతో ప్రజలు తాగునిటికి, నిత్యఅవసరాలకు నానా అవస్థలు పడ్డారు, ఇట్టి సమస్యను వార్డు ప్రజలు నూతనంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు ఆవుల రాజశేఖర్ దృష్టికి తీసుకువెళ్లగా వారు గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ గురజాల బుచ్చిరెడ్డి మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ తో చర్చించి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది. గత కొన్ని రోజులు తాగునీటికి ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలు ఈరోజు బోరు బాగు చేయించడంతో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు..