దస్తగిరయ్య స్వామి ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే బీవీ హాజరు

★ క్రికెట్ వెళ్ళిపోతున్న విజేతలకు వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే చేతుల మీద బహుమతులు ప్రధానం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దమరివీడు గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ దస్తగిరియ్యా స్వామి ఉరుసులో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతులు ప్రదానం చేసి, క్రీడాకారులను అభినందించారు. శ్రీ దస్తగిరియ్యా స్వామి కృపతో గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, ఐక్యతతో ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కురవ మల్లయ్య, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.