పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 13 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని మాజీ ఏం ఏ ల్ ఏ తుంకుంట నర్సారెడ్డి స్వ గృహ్వం లో నిర్వహించిన విలేకరుల సమావేశం వారు మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల పేరిట విభజించి పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని బ్రష్టు పట్టిస్తుండగా, భారత్ సమగ్రాభివృద్ధి కోసం గాంధీల కుటుoభమే దేశానికి శ్రీరామరక్షగా నిలుస్తుందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి స్పష్టం చేశారు. గజ్వేల్ లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నాచగిరి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డిలతో కలిసి ఆమె మాట్లాడారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే పార్లమెంట్ సభ్యురాలిగా దీటైన జవాబు చెబుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలర్పించిన జివంగత ప్రధానిగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సాధన కోసం ప్రాణాలను ఘనంగా పెట్టి పోరాడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల స్ఫూర్తితో వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుండే ప్రణాళిక బద్ధంగా సాగాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని బిజెపి గాంధీల చరిత్రను కనుమరుగు చేసే కుట్రలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బహిర్గతం చేయాలని, గత కాంగ్రెస్ ప్రభుత్వం యుపిఏ సర్కార్ అమలు చేసిన పథకాల పరిరక్షణకు ఉద్యమించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొనగారి రాజు మండల బాధ్యుడు సుకేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ గాడిపల్లి శీను రమేష్ గౌడ్ సమీర్ నరసింహారెడ్డి శివారెడ్డి అజ్గర్ అజార్ తదితరులు పాల్గొన్నారు