పయనించే సూర్యుడు, జనవరి 13, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళమెత్తుతూ, నిష్పక్షపాత వార్తలతో దూసుకుపోతున్న 'ప్రజాపక్షం' దినపత్రిక సమాజ హితం కోరే పత్రిక అని బచ్చన్నపేట ఎస్సై ఎస్.కె. హమీద్ అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రజాపక్షం దినపత్రిక - 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను బచ్చన్నపేట మండల విలేకరి తేలుకంటి శ్రీనివాస్ తో కలిసి ఆయన ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ఎస్సై ఎస్.కె హమీద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని,రాజ్యాంగం కల్పించిన నాలుగో స్తంభంగా జర్నలిజం సమాజ అభివృద్ధికి తోడ్పడుతోందని అన్నారు. వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నిజాలను వెలికితీయడంలో, ప్రజల పక్షాన నిలబడటంలో ప్రజాపక్షం పత్రిక జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని ఆయన ప్రశంసించారు. పాఠకుల మనసు గెలుచుకునేలా వార్తా కథనాలను అందిస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించడం ఒక్క మీడియాకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో పత్రిక చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నర్సిరెడ్డి, అఖిల, రాకేష్, నవీన్ రెడ్డి, విజయ్, మహేష్, వినయ్ పాల్గొన్నారు.