పయనించే సూర్యుడు జనవరి 13 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. నేషనల్ గేమ్స్ లో చెన్నారావు పేట మండలం అక్కల్ చెడ గ్రామ యువకుడు భూక్య ప్రకాష్ సత్తా చాటాడు.. నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆశీస్సులతో గ్రామానికి చెందిన భూక్య ప్రకాష్ ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో జరిగిన 33 వ జూనియర్ నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాదించినట్లుగా యువకుని తల్లి దండ్రులు భూక్య స్వరూప-రవి లు తెలిపారు.. ఈ సందర్భంగా యువకుడు అండర్19 నేషనల్ ఛాంపియన్షిప్ సాధించడం పట్ల తల్లి దండ్రులు తాత నానమ్మ పెద్దనాన్నలు మాజీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ -సరిత గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ భూక్య శ్రీనివాస్-శ్రేదేవి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలోని అక్కల్ చెడ గ్రామంలో మట్టిలో మాణిక్యమైన భూక్య ప్రకాష్ నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.. యువకుడు ప్రకాష్ హైద్రాబాద్ లోని హకీం పేట స్పోర్ట్స్ పాఠశాలలో విద్యాబ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం పూణేలో స్పోర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అక్కల్ చెడ గ్రామాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన యువకుడు ప్రకాష్ మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా గ్రామస్థులు కుటుంబ సభ్యులు కోచ్ ఉపాధ్యాయులు, ఆర్ జి ఎన్ హ్యూ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ దేవానంద నాయుడు మరియు నేషనల్ సెక్రటరీ భూక్య శ్రీనివాస్ మన సభ్యుడైన భూక్య అని ప్రకాష్ నేషనల్ జూనియర్ గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో గౌరవంగా ఉంది అని సంతోషము వ్యక్తము పరిచినారు మరియు అభినందించారు..
