పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోగల చిన్న తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో రాత్రి దొంగతనం జరిగింది .ఈ విషయాన్ని ఆలయకర్త హరి ముకుందపండ తెలిపారు. వెంకటేశ్వర స్వామి నామాలు వెండి సామాను బంగారు ఆభరణాలు మూడు హుండీలు దొంగిలించబడ్డాయని విలేకరులకు తెలిపారు సుమారు 80 లక్షల వరకు ఆలయంలో చోరీ జరిగిందని ఆయన అన్నారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రెండు నెలల క్రితం ఈ ఆలయంలో జరిగిన తొక్కేసలాటలో 9 మంది చనిపోయిన విషయం పాఠకులకు విధితమే. అప్పటినుండి ప్రభుత్వ ఆంక్షలు ప్రకారం స్వామి వారి పూజలు ఆలయ కర్త మాత్రమే నిర్వహిస్తున్నారు. గత రాత్రి కూడా ఆయన పూజలు నిర్వహించాలని ఉదయం స్వామి వారి పూజలో పాల్గొనడానికి రావడంతో ఈ విషయం బయటపడిందని ఆయన తెలిపారు.