పెనుగంచిప్రోలు లో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

★ ఓవర్ లోడ్ తో ఆటోలను నడప వద్దు - యంవిఐ యంవియన్ నారాయణ రాజు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 13 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్లో ఈ రోజున జగ్గయ్యపేట రవాణా శాఖ ఆధ్వర్యంలో 37 వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల పెనుగంచిప్రోలు కేంద్రం గా ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ యంవియన్ నారాయణ రాజు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలకి సంబంధించిన కాగితాలన్ని ఫోర్స్ లో ఉండేలా చూసుకోవాలని, డ్రైవింగ్ చేసే వారికి తప్పని సరిగ లైసెన్స్ ఉండాలన్నారు. మైనర్లకి వాహనాలను ఇవ్వదని, మైనర్లు వాహనాలను స్పీడ్ గా నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగితే, వారికి వాహనం ఇచ్చిన వారే శిక్షార్హులన్నారు.ఆటో నడిపే వారు తప్పని సరిగా కాకి చొక్కాను వేసుకొని అన్ని కాగితాలను, ఫోర్స్ లో ఫిట్నెస్ ఉంచుకోవాలన్నారు.కార్లు నడిపే వారు తప్పని సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ప్రమాదాలు నివారించడానికి తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించి, సేఫ్టీగా ఇంటికి చేరుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోటర్ వెహికల్ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.