ప్రజా సమస్యల పరిష్కారానికైరిలే నిరాహార నేడు 5వ, రోజు కొనసాగుతుంది

పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి /13: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ప్రజా సమస్యల పరిష్కారానికై.. ఇల్లంతకుంట మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార నేడు 5వ, రోజు. కొనసాగింది ఈ సందర్బంగా సామాజిక ఉద్యమ కారుడు సావనపెల్లి రాకేష్, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్నటువంటి అనంతారం బ్రిడ్జి వెంటనే పూర్తి నిర్మాణం చేయాలి.ఇల్లంతకుంట నుండి ఆనంతారం, రహీంఖాన్ పేట నుండి వల్లంపట్ల, ఒగులాపూర్ మరియు వెల్జిపూర్, గుడప్పల్లే గ్రామాల మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వెళ్లే రోడ్డు పూర్తి గుంతల మయమై బస్ లో ప్రయాణం చేయడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రజల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ఎలా ప్రజా ప్రభుత్వం అవుతుందో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి,ప్రజల పక్షాన 5వ. రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమణి అన్నారు,రోడ్ల సమస్యలు వెంటనే పరిస్కరించాలి, డిగ్రీ కళాశాల మంజూరు చేయాలనీ, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తూ.రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష. చేపట్టడం జరుగుతుందని తెలుపుతూ మీ కోసం చేపడుతున్న దీక్ష లో మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.. ఈ కార్యక్రమం లో..హై కోర్ట్ న్యాయవాది తడ్కపల్లి సుష్మిత, సర్పంచ్ ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు చల్ల నారాయణ, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు తడ్కపెల్లి భూమయ్య,ఎం ఆర్ పి ఎస్, రాష్ట్ర నాయకులు గుండ్రేడ్డి రాజు మాదిగ, బి ఎస్ పి. మండల అధ్యక్షులు మాంకాల అమర్,జిల్లా నాయకులు ఏనుగుల లింగన్న,ఆయా గ్రామాల నాయకులు నాయకులు ర్యాగటి దేవదాసు,న్యాత అశోక్, సిద్ధం కరుణాకర్, భూమల్ల ప్రశాంత్, భూత్కూరి వినోద్, భూమల్ల అజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *