ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ప్రజా దర్బార్

★ క్యాలెండర్ ఆవిష్కరణలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ★ సబ్ కలెక్టర్ను సన్మానించిన జర్నలిస్టులు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 13, తల్లాడ రిపోర్టర్ పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదిలా పత్రికా రంగం పనిచేయాలని కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ అన్నారు. సోమవారం కల్లూరు మండల కేంద్రంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రముఖ దినపత్రిక ప్రజా దర్బార్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకోని మోసాలకు పాల్పడుతున్నారనీ, ఇటువంటి మోసాలపై తమ వంతు బాధ్యతగా ప్రజలను చైతన్య పరచడంలో జర్నలిస్టులు ముందు ఉండాలని ఆయన కోరారు. అనంతరం జర్నలిస్టులు సబ్ కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్ మండల రిపోర్టర్ ఇనపనూరి కుటుంబరావు, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ ఇటుకల వెంకట చలపతి గౌడ్, సాయి వెంకటక్రిష్ణ గౌడ్, విజయలక్ష్మి, పల్లవి, అయిలూరి చిన్న కృష్ణా రెడ్డి, నాగమల్లి పాల్గొన్నారు.