పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 బోధన్:పెరిక సంఘం జిల్లా నూథన కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు మైదం రాజన్న సికింద్రాపూర్ ప్రధాన కార్యదర్శిగా సాలూర మండల కేంద్రానికి చెందిన అల్లె రమేష్ ఎంపికయ్యారు. ఈనెల 19వ తేదీ సోమవారం రోజున కార్యవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవాన్ని పురస్కరించుకొని పెరిక సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మరియు కులస్తులు అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని యెండల టవర్స్ దగ్గర ఉన్నటువంటి జిల్లా పెరిక సంఘం భవనంలో ప్రమణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గం మరియు కులస్తులు తదితరులు పాల్గొన్నారు.