పయనించే సూర్యుడు జనవరి 13 ఆదోని రూరల్ రిపోర్టర్. ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ అమరావతి నగర్ కాలనీలో గత రెండు నెలలుగా బూడిద వర్షం కురుస్తుందోని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ ని మరియు మున్సిపల్ కమిషనర్ కృష్ణ ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ దాదాపు 35సంవత్సరాలు క్రితం ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేసిన అమరావతి నగర్ కాలనీలో గత రెండు నెలలుగా చుట్టూ ఉన్న ఫ్యాక్టరీల నుండి వచ్చే బూడిద వల్ల విపరీతమైన వాయు కాలుష్యము అవడమే కాకుండా ఇల్లలోకి బూడిద చేరడమే కాకుండా అమరావతి నగర్ ప్రజలు ఆ వాయు కాలుష్యమయిన బూడిదను పీల్చడమువల్ల శ్వాస సంబంధమైన రోగాల బారిన పడుతున్నారనితెలిపారు. రోజువారి వాడకానికి నిల్వ ఉంచుకున్న నీటిలో కూడా ఈ బూడిద కలిసి చర్మ సంబంధమైన వ్యాధులు పెరిగిపోతున్నాయని లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో బిజెపి నాయకులు వెల్లాల మధుసూధన శర్మ, పరుశురాం, రియాజ్, శ్రీనివాసులు, నాగేష్ పాల్గొన్నారు.
