బాధిత కుటుంబాన్ని పరామర్శ

పయనించే సూర్యుడు ,13 జనవరి 2026 భీంగల్ మండల రిపోర్టర్: కొత్వాల్ లింబాద్రి ,నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణానికి చెందిన జనం న్యూస్ భీంగల్ మండల రిపోర్టర్ తోపారం సురేందర్ యొక్క అమ్మమ్మ అనారోగ్యంతో ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న బాల్కొండ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సోమవారం భీంగల్ పట్టణానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మృతురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.