పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 13, తల్లాడ రిపోర్టర్ బిఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు సత్తుపల్లి గడ్డ ఒక పునాది వేసిందని సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పారు. సత్తుపల్లి గడ్డ లో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అధ్యక్షతన తల్లాడ మండలం నరసరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్ శనక్కాయల సత్యనారాయణను మరియు వార్డు సభ్యులను ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొని వారిని ఘనంగా సత్కరించారు. అంతకుముందు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అత్యధిక మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎప్పుడు ప్రజలను మోసం చేయలేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన రెడ్డి, దుగ్గిదేవర వెంకటలాల్, మువ్వ మురళి, పట్టణ యువజన నాయకులు జి.వి.ఆర్, నూతన సర్పంచులు, వార్డ్ మెంబర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
