పయనించే సూర్యడు / జనవరి 13/ కాప్రా ప్రతినిధి సింగం రాజు యువతకు స్ఫూర్తి ప్రదాత, భారత దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన మహోన్నతుడు స్వామి వివేకానంద గారి 163వ జయంతి వేడుకలు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో ఘనంగా నిర్వహించారు. మల్లాపూర్ డివిజన్ యువజన కాంగ్రెస్ నాయకులు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ యువతను చైతన్యపరిచిన మహనీయుడు స్వామి వివేకానంద గారని పేర్కొన్నారు. దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఆయన ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకమని తెలిపారు. ఈ సందర్భంగా మల్లాపూర్ ప్రజలకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోయలకొండ రాజేష్, హెచ్. మహేష్ నాయక్, నిక్కీ గౌడ్, టిల్లు ముదిరాజ్, మల్లి యాదవ్, దాసరి సాయి పాల్గొన్నారు. అలాగే కాలనీ వాసులు రవీంద్ర, అంజి, యోగి, ఆరిఫ్, వినోద్ గౌడ్, మంజుల, శారదా, భారతి, తాజ్, రాజేష్, హరి, మల్లేష్, శివ, భాను, కుమార్ తదితరులు పాల్గొన్నారు.