మైనింగ్ దోపిడిని అరికట్టండి

★ అక్రమ మైనింగ్ లపై అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తున్నా వారిపై జరుగుతున్న బెదిరింపులు దాడులు ఖండిస్తూ ఐటీడీఏ ఎదుట ధర్నా

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి 13.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) సోమవారం నాడు రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ గంగవరం మండలం ఓజుబంద గ్రామాల్లో నల్లరాయి క్వారీ ముసుగులో అక్రమంగా మట్టిని దోచుకుంటున్నారని ఇప్పటికే ఓజుబంద గ్రామస్తులు నడుస్తున్న నల్లరాయి క్వారీ వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని వాటిని తక్షణం మూసివేయాలని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసి ఉన్నారని నల్లరాయి క్వారీ ముసుగులు అక్రమంగా గ్రావెల మట్టి తరలిస్తూ మైనింగ్ మాఫియా కోట్లు దండుకుంటుందని ఆయన మండిపడ్డారు అదేవిధంగా రంపచోడవరం మండలం నర్సాపురం నల్లరాయి క్వారీల వలన నష్టపోతున్న బాధిత ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే మైనింగ్ మాఫియా మరియు అధికారులు కొంతమంది బినామీ దారులను రెచ్చగొట్టి ఫిర్యాదు దారులపై పై గొడవలు చేయించడం దాడులు చేయించడం చేస్తున్నారని ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు గానీ పోలీసులు గాని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆయన మండిపడ్డారు వైరామవరం మండల కేంద్రంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని ఫిర్యాదు చేసినందుకు అక్రమ కట్టడ దారులు రెవెన్యూ పోలీస్ అధికారులు అండదండలతో ఫిర్యాదు రాలైన లండ శారద దేవి అనే మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం జరిగిందని దాడి చేసిన వారిపై మరియు చేయించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు దిరిసినపల్లి గ్రామం లో నవంబర్ 24వ తేదీన విచారణ పేరుతో గ్రామాలకు వచ్చిన రంపచోడవరం ఎమ్మార్వో మైనింగ్ ఏడి పాడేరు వారు ప్రజలను రెచ్చగొట్టి బల్లెం గంగాభవాని కుటుంబాన్ని మరియు వారికండగా నిలిచిన ఆదివాసి నాయకులు పై దాడి చేసిన ఘటనపై ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఇప్పటికైనా పిఓ స్పందించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాలని కోరాటం జరిగింది ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మహిళ ప్రధానోపాధ్యాయులను మరియు డిప్యూటీ వార్డెన్ లను వేధిస్తున్న అడ్డతీగల ఏటిడబ్ల్యు కృష్ణమోహన్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది కూనవరం మండలం కూనవరం పంచాయతీ లో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై సి.బి.సి.ఐ.డి తో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది ఏజెన్సీలో పీసా నిబంధనలకు విరుద్ధంగా 1/70 చట్టాన్ని ఉల్లంఘించి బినామీ పేర్లతో మైనింగ్ డిపార్ట్మెంట్ ని స్థానిక అధికారులను మేనేజ్ చేస్తూ నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ లపై ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఐటీడీ ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి అందించడం జరిగింది విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని ప్రాజెక్ట్ అధికారి వారు తెలియజేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ సీనియర్ నాయకులు బోరగ గంగరాజు దొర ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర పీట ప్రసాద్ బల్లెం గంగాభవాని లండా శారదా దేవి కంగాల అబ్బాయి దొర చోడి ఏడుకొండల రావు దొర కారం అరుణకుమారి కుంజాం లక్ష్మణ్ రావు దొర సంకురు దొర దొరబాబు కృష్ణవేణి లోవ కుమారి మైనింగ్ బాధితులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.