యువకాంగ్రెస్ కార్యవర్గ సమావేశంనిర్వహణ.

పయనించే సూర్యుడు, జనవరి 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శేరిలింగంపల్లి యువకాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వ హణ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 106వ డివిజన్ యువకాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో యువకాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, యువత సమస్యలు, స్థానిక ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమా లపై నాయకులు చర్చించారు. యువతను రాజకీయా ల్లో చురుకుగా పాల్గొనాలని, ప్రజల సమస్యలు తెలుసు కొని పార్టీ ఆలోచనలు ఇంటింటికి చేరేలా కృషి చేయా లని నాయకులు పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై కూడా సమావే శంలో వివరమైన చర్చ జరిగింది. కార్యక్రమం ముగింపు లో నాయకులు ఐక్యతతో పనిచేస్తామని, యువత శక్తిని ప్రజాసేవకు వినియోగించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడే సంజయ్ ( రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, శేరిలింగంపల్లి ఇంచార్జి ), జకేర్ ( అసెంబ్లీ ప్రెసిడెంట్ ), మోసిన్ ( డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ , కే. మహేందర్ ( టీంకు ) డివిజన్ ప్రెసిడెంట్, తది తరులు పాలుగోన్నారు.