
పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి/13: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్: సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద చౌరస్తా ఆవరణలో ఇల్లంతకుంట గ స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మామిడి పర్షరాము ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమంలో ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు, ఇల్లంతకుంట మండల ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ జగన్ మోహన్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా వివేకానందుని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో యువ సమ్మేళనాలు జరుగుతాయి కనుక మండలంలోని యువకులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ గ్రామంలోని యువకులందరూ స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రపంచ దేశాలకు హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువకులు భారతదేశానికి కావాలని, అలాంటి యువకులు దేశంలో ఉన్నట్లయితే భారతదేశ పరమ వైభవ స్థితి చేరుకుంటుందని కోరుకున్నారు. స్వామి వివేకానంద కోరుకున్నటువంటి కలలను మనమందరము సాకారం
చేయాలని మనవి చేసుకుంటున్నాను. గ్రామంలోని యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట గ్రామ ఉప సర్పంచ్ మూగు నాగరాజు శర్మ ,ఇల్లంతకుంట గ్రామ పాలకవర్గం సభ్యులు,ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్, ఆర్ఎస్ఎస్ జిల్లా పర్యావరణ సంయోజక్ బత్తిని ఆంజనేయులు,ఖండ కార్యవాహ తాటిపల్లి మహేష్, నార్ల రామ్ కిషన్, బొల్లం ధనుంజయ్, మధు పవన్ అమన్ అఖిల్ బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్, నాయకులు బత్తిని స్వామి, మల్లేశం, ఒగ్గు నరసయ్య యాదవ్, కునబోయిన బాలరాజు, శివ నిఖిల్ మామిడి హరీష్ నరేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.