పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13, మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని మంథని పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వివేకానంద స్టాచ్యూ ఫౌండర్ అండ్ చైర్మన్ బెజ్జంకి డిగంబర్ మాట్లాడుతూ స్వామి వివేకానందను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.భారత దేశ గొప్పతనాన్ని సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసింది స్వామి వివేకానంద అని ఆయన పేర్కొన్నారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభల్లో హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఆయన తెలిపారు.స్వామి వివేకానంద మాటలు నేటి యువతకు గొప్ప మార్గదర్శకంగా ఉంటాయని ఆయనను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని, మంథని పట్టణంలో నేను ఈ విగ్రహం నెలకొల్పడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నానని దీనికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రఘోత్తం రెడ్డి, సీనియర్ సిటిజన్ తాటి బుచ్చయ్య గౌడ్ ,మాజీ బిజెపి పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్, కొమురవెల్లి విజయ్ కుమార్ ,మంథని అధ్యక్షులు రావుల సతీష్, మేడగొని రాజమౌళి గౌడ్ ,బత్తుల సత్యనారాయణ, తూర్పాటి రాము, శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ నాయకులు కనుకుంట్ల స్వామి తో పాటు తదితరులు పాల్గొన్నారు.