యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

★ మంచిర్యాల వివేకవర్ధిని కాలేజ్ కరస్పాండెంట్ ఊదరి చంద్రమోహన్ గౌడ్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివేకవర్ధిని కాలేజ్ లో వివేకానంద 163 వ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణంలో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా లయన్ వివేకవర్ధిని కాలేజ్ కరస్పాండెంట్ ఊదరి చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ స్వామి వివేకానందను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత దేశ గొప్పతనాన్ని సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసింది స్వామి వివేకానంద అని ఆయన పేర్కొన్నారు. చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభల్లో హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఆయన కొనియాడారు స్వామి వివేకానంద మాటలు నేటి యువతకు గొప్ప మార్గదర్శకంగా ఉంటాయని ఆయనను యువత ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని మంచిర్యాల పట్టణంలో స్వామి వివేకానంద విగ్రహం నెలకొల్పడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నానని దీనికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివేకవర్ధిని కాలేజ్ విద్యార్థులు లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు.