యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద

★ ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు : సుంకరి సాయిలు

పయనించే సూర్యుడు జనవరి 13 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని అభావిప రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుంకరి సాయిలు పేర్కొన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పాపన్నపేటలో స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర కఠోర మేధస్సు గల యువత దేశ సంపదని వివేకనందుడు అన్నారని గుర్తు చేశారు. యువత ఆయన బాటలో నడవలన్నారు. వివేకానందుడి జయంతి నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వరకు ఈ యువజన దినోత్సవాలు జరుగుతాయన్నారు. భాజపా జిల్లా నాయకులు బికొండ రాములు తదితరులు ఉన్నారు.