పయనించే సూర్యుడు జనవరి 13 (జరిగిన ప్రతినిధి కమ్మగాని నాగన్న)భారతదేశ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువ భారత్ – వరంగల్ (తెలంగాణ) సహకారంతో పాలకుర్తి మండల కేంద్రంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద గారి ఆశయాలను యువతలో విస్తృతంగా ప్రచారం చేయడం, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా పలు అవగాహన కార్యక్రమాలు, ఉపన్యాసాలు, యువజన ప్రేరణాత్మక ప్రసంగాలు నిర్వహించబడాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకి రామ్, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ ఎం.ఈ.ఓ నర్సయ్య గ్రామ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్నగౌడ్, ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, యువ చైతన్య యూత్ సభ్యులు గ్రామ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు