పయనించే సూర్యుడు: జనవరి 13: హుజురాబాద్ కాస్టెన్సీ ఇంచార్జ్ దాసరి రవి : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ అధ్యక్షులు, ప్రజాకవి రచయిత వ్యక్తిత్వ వికాసా నీపూనులు, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత, తత్వవేత్త ఆధ్యాత్మిక విశ్వ గురువు డాక్టర్ నాగుల సత్యంగౌడ్ రచనలు వారి ఆధ్యాత్మిక సేవలను ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్, అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు పలు సంస్థల వ్యవస్థాపకులు కదిరి వెంకటరమణారావు సత్యం గౌడ్ సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డుకు ఎంపిక చేసి అవార్డును హైదరాబాదులోని రవీంద్ర భారతిలో పలు సంస్థల వ్యవస్థాపకులు వెంకటరమణ రావు ఈ కార్యక్రమం లో పాల్గొని ముఖ్యఅతిథి ఫార్మర్ చైర్మన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ కోలేటి దామోదర్ గుప్తా, డాక్టర్ శివ నాగార్జున రెడ్డి,ఫిలిం ఆర్టిస్ట్ ఐశ్వర్య, డాక్టర్ పి. ఝాన్సీ రాణి సత్యం గౌడ్ కు పట్టు శాలువ, మోడల్ ధరింపజేసి సన్మాన పత్రంతో పాటు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఆర్టిస్ట్, నాట్య కళాకారులు, వివిధ సంస్థల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.