పయనించే సూర్యుడు జనవరి 13, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా సోమవారం రాయపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలను గ్రామంలోని 3వ వార్డు సభ్యురాలు బుజాగౌని అరుణ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పండుగ వాతావరణం ఉట్టిపడేలా మహిళలు, యువతులు రంగురంగుల ముగ్గులతో వీధులను ముస్తాబు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవంలో గ్రామ సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామీణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ,గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ , గ్రామ ఉపసర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్, మాజీ సర్పంచులు కమ్మదనం నర్సింహులు గౌడ్, నేరళ్ళ గంగాధర్ గౌడ్, లింగం, శివ, శ్రీను, తిరుపతి, వంశీ, శంకర్ తో పాటు వార్డు సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
