
పయనించే సూర్యుడు జనవరి 13-2026 కరీంనగర్ న్యూస్: రేణికుంట గ్రామపంచాయతీ ఆవరణలో వడ్డెర సంఘం కులస్తులు నాయకులు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్డే ఓబన్న జయంతి 219 వడ్డెర సంఘం నాయకులతో పాటు ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుక ఆంజనేయులు మాట్లాడుతూ ఈరోజు వడ్డే ఓబన్న 219 జయంతి సందర్భంగా వారి ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వడ్డే ఓబన్న నిరుపేద కుటుంబం లో బండ రాళ్లు కొట్టుకొని జీవించే కుటుంబంలో జన్మించినాడు వడ్డే ఓబన్న కేవలం వడ్డెర కులానికే కాకుండా భారత దేశ ప్రజలందరికీ బానిస సంకెళ్ల నుండి విముక్తి కోసం తెగించి పోరాడిన యోధుడు స్వతంత్ర పోరాటంలో సాయుధ పోరాటం చేశారని అన్నారు ఆయన ఈ రోజు దేశ నిర్మాణంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ఘనత దేశంలో అక్రమ వసూళ్లు చేసిన వాళ్లను ఎదిరించి పోరాటం చేసి వారిని ఎదిరించాడు దేశ నిర్మాణంలో బలమైన పునాది వేసుకున్నారు ఇంతటి మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటూ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన ఆశయాలను మనం కొనసాగిద్దామని అన్నారు మా గ్రామంలో ఉన్న వడ్డెర కులస్తులందరికీ మా పాలకవర్గం తో పాటు నేను అందుబాటులో ఉంటామని అన్నారు వడ్డెర కుల సంఘం ఉప అధ్యక్షులు కుంచం కుమార్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న 219 జయంతికి సందర్భంగా సర్పంచ్ ఎలుక ఆంజనేయులు పాలకవర్గం సభ్యుల అందరికీ వడ్డెర సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానం చేసి పాలకవర్గం సభ్యుల అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు వడ్డే ఓబన్న 219 జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది మళ్ళీ వచ్చే వడ్డే ఓబన్న జయంతి వరకు రేణికుంట గ్రామంలో విగ్రహం ప్రతిష్టాపన చేస్తామని వడ్డెర కుల సంఘం నాయకులు కార్యకర్తలు అందరూ సహకరించాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ వీరారెడ్డి ఉప సర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి వార్డు సభ్యులు వడ్డెర సంఘం నాయకులు తిరుపతి శ్రీనివాస్ రవి ప్రవీణ్ తిరుపతి నరసింహులు కొండయ్య రవి ప్రశాంత్ రాజు బాలయ్య సమ్మయ్య పాగయ్య తదితరులు పాల్గొన్నారు
