లట్టుపల్లి గ్రామంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 13 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన బోధనలు యువతకు మార్గదర్శకమని, దేశ అభివృద్ధిలో యువశక్తి పాత్ర కీలకమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, శేఖర్ గౌడ్, సంతోష్ రెడ్డి, నాగేందర్, శ్రీశైలం, రాజేంద్ర గౌడ్, మహేష్, గౌరారం, ఇప్పలతాండ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగగా, యువత పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వివేకానంద ఆలోచనలను స్మరించుకున్నారు.