వివేకానంద జయంతి సందర్భంగా ఖానాపూర్‌లో మెగా రక్తదాన శిబిరం

* 43 మంది యువకుల స్వచ్ఛంద రక్తదానం

పయనించే సూర్యుడు జనవరి 13 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శివ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానందుడి విగ్రహానికి సర్పంచ్ ఇందిరమ్మతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువకులు సామాజిక బాధ్యతతో మెలగినప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. యోగా పతంజలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వస్పరి శివుడు మాట్లాడుతూ వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత మంచి నడవడికతో సమాజానికి ఉపయోగపడేలా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ యువకులచే ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, మిత్ర వాలంటరీ బ్లడ్ సెంటర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో 43 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాధాకృష్ణ, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, మాజీ ఉపసర్పంచ్ వెంకట్రాములు గౌడ్, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, సుదర్శన్, శేఖర్, మధు, విష్ణు, నరసింహ, మురళి, రామ్ మాధవ్, ప్రవీణ్, ప్రతాప్ రెడ్డి, నవీన్ రెడ్డి, బంగారయ్య, సురేష్, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *