
పయనించే సూర్యుడు, జనవరి 13, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక మేజర్ గ్రామ పంచాయతీ గాంధీనగర్ కాలనీ లో వెంకటరమణ సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం బ్రాంచ్ మేనేజర్ ఎల్ రవి మరియు వారి స్టాఫ్ పాల్గొని గెలుపొందిన మహిళలకు మొదటి , ద్వితీయ ,తృతీయ బహుమతులను అందజేశారు అదేవిధంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆడపడుచులకు, చిన్నారులకు బహుమతులు అందించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల లో అతి పెద్ద పండుగ సంక్రాంతి పిల్లలు పెద్దలు మహిళలు అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండగని, ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాసరి వెంకట రమణ భూక్య చిరంజీవి, చుక్కపల్లి బాలాజీ, దార్ల బేబీ రాణి , కోడి రెక్కల రంజిత్ తదితరులు పాల్గొన్నారు
