పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 బోధన్: స్వామి వివేకానంద ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాయుడు అని సాలూర గ్రామ యువకులు అన్నారు. సోమవారం జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సాలూర మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతిని గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సాలూర మండల ప్రజలకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఇల్తెపు శంకర్, వడ్ల దత్తురాం, సొక్కం రవి,ముట్టెన్ ప్రకాష్, శివకాంత్ పటేల్, శేఖర్, భాస్కర్, రమేష్, శివరాజ్, గంగాధర్, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు