సిపిఐ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుండి మున్సిపల్ వరకు ర్యాలీ.

పయనించే సూర్యుడు 13-01-2026 జబర్దస్త్ కామారెడ్డి కాంసెన్సీ ఇన్చార్జి. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ఆధ్వర్యంలో. హలో కామ్రేడ్. చలో ఖమ్మం. నినాదంతో కొత్త బస్టాండ్ నుండి కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరు డు మరియు కామ్రేడ్ సిపిఐ కామారెడ్డి రాష్ట్ర సీనియర్ నాయకులు వీఎల్ నరసింహ రెడ్డి రంగాచారి విగ్రహానికి. మరియు వారి ఫోటోలకు పూలదండలతో భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు కార్మిక ప్రజా సంఘ నాయకులు ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారీ ర్యాలీకి ముఖ్యఅతిథిగా సిపిఐ. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ హాజరై మాట్లాడుతూ. రంగాచారి. వీఎల్ నరసింహారెడ్డి కామారెడ్డికి భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర వారిదని నిరుపేదలకు ఇండ్ల పంపిణీ 22 ప్యాకేజ్ గోదావరి జలాల మరియు డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ప్రతి కార్మికునికి ప్రతి పేదవాళ్ళకి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక సమస్యలపై నిరంతరం పోరాటం నిర్వహించిన చరిత్ర వారిదని వారిది వారసత్వంగా కుటుంబం మొత్తం కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటాలు నిర్వహించాలని నిత్యం ప్రజా సమస్యలు పోరాటాలు నిర్వహించారని తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడు రంగాచారని కామారెడ్డి ప్రాంతానికి వీరిద్దరూ ఒక ఉద్యమ బిడ్డలని ఆమె అన్నారు ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ 5 లక్షమంది ప్రతినిధులతో భారీ ప్రదర్శన ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ప్రతి పేదవారికి కార్మికులకు పని భద్రత ఉండాలని కార్మిక రైతు చట్టాలను వ్యతిరేకించాలని కార్మికులకు పని గంటలు పెంచిన కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అలాగే పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తుందని ఆమె అన్నారు ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేక అన్ని రంగాలను ప్రైవేటుపరం చేసిన పరంగా హైదరాబాద్ ప్రాంతాలు లాంటి వలస వెళ్లడం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుందని ఈ ఐదు రోజుల జాతర సందర్భంగా ప్రజా సమస్యలు రేషన్ కార్డు పెన్షన్లు నిత్యవసర ధరలు రైతుల సమస్యలు రైతులు తప్పుడుబడ్డ పాస్తు పుస్తకాలను సరిచేయాలని స్వామినాథ కమిటీ ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతుబంధులు అర్హులకు కౌలు రైతులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి కోటి అన్న పదేళ్లు గడుస్తున్న లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుందని ఆమె అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అదేవిధంగా కామారెడ్డి జిల్లా బిక్కనూ ర్. మండల కేంద్రంలో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించాలని చూస్తున్న కంపెనీ యజమాన్యాలు ప్రజల అభిప్రాయం ప్రజలకు హాని కలిగించే విధంగా ఉన్నాయని వాటిని కమ్యూనిస్టు పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీల కార్మిక సంఘాల అభిప్రాయం జిల్లా కలెక్టర్ తీసుకోవా ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఐదు రోజులపాటు జిల్లాలో ప్రచార జాత నిర్వహించి అనేక సమస్యలు పరిగణానికి తీసుకొని 18న జరిగే బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఆయనకు తెలియజేస్తామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు. పశ్య పద్మ సిపిఐ. కామారెడ్డి జిల్లా కార్యదర్శి. ఎల్. దశరథ్. జిల్లా నాయకులు ఎం లక్ష్మణ్. నర్సింగరావు రాజిరెడ్డి హైదర్ ఈశ్వర్ మల్లేష్ హనుమాన్లు ప్రవీణ్ శివప్రసాద్ జి రాజు ఎండి . రఫీక్. మహిళా నాయకురాలు లక్ష్మి సంగం పూజ దేవయ్య పద్మ వై దశరథం. జమున భారతి రజియా బేగం హసీనా బేగం రాధమ్మ. సత్యం. పర్వీనా బేగం ఈ ముగింపు కార్యక్రమంలో సుమారుగా సిపిఐ అనుబంధ సంఘం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇట్లు సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి. ఎల్. దశరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *